Date of Publish : 31 August 2026, 6:04 pmPosted by : Reporter Srikanth
వెయ్యి రోజుల కాంగ్రెస్ అసమర్థ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా వారం రోజుల నిరసన కార్యక్రమాలు
ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం :
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అమలు కాని హామీలు, ప్రజలపై మోపిన భారాలను ప్రతి ఇంటికి చేర్చేందుకు సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో “సమరభేరి” కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.
సోమవారం హుజూరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. రైతు, మహిళ, యువత, విద్యార్థి, కార్మికుడు, ఉద్యోగి… ఇలా ప్రతి వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సమరభేరి కార్యక్రమాలను చేపడుతోంది” అని స్పష్టం చేశారు.
సమరభేరి కార్యక్రమాల షెడ్యూల్. సెప్టెంబర్ 2 – హుజూరాబాద్*| ఉదయం 10.00 గంటలకు
హుజూరాబాద్ చౌరస్తాలో భారీ ధర్నా నిర్వహించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను ప్రజలకు గుర్తు చేస్తూ ‘బాకీల కార్డు’ పంపిణీ, 420 అడుగుల భారీ ఫ్లెక్సీ ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు.
సెప్టెంబర్ 3 – వీణవంక* | ఉదయం 10.00 గంటలకు
వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్, యూరియా కొరత, రైతు బీమా, రైతు సంక్షేమ అంశాలపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.
సెప్టెంబర్ 4 – కమలాపూర్*| ఉదయం 10.00 గంటలకు
మహిళలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు తదితర హామీల అమలును డిమాండ్ చేస్తూ వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.
సెప్టెంబర్ 5 – జమ్మికుంట*| ఉదయం 10.00 గంటలకు
ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ అమలుతో పాటు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.
సెప్టెంబర్ 6 – గ్రామపంచాయతీలు, ఆటో కార్మికుల ఆందోళనలు. హుజూరాబాద్ ఉదయం 10.00 గంటలకు. జమ్మికుంట ఉదయం 11.00 గంటలకు. ఇల్లందకుంట మధ్యాహ్నం 12.00 గంటలకు
గ్రామపంచాయతీల ఆర్థిక దుస్థితి, పెండింగ్ బిల్లులు, మౌలిక వసతుల కొరత, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆటో కార్మికులతో భారీ ర్యాలీలు చేపట్టి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తామని తెలిపారు.
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సమస్యలు, ఫిర్యాదులతో కూడిన వేలాది వినతిపత్రాలను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వెల్లడించారు.
సెప్టెంబర్ 8 – కరీంనగర్ జిల్లా కేంద్రం | అంబేద్కర్ విగ్రహం వద్ద
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించి సమరభేరి కార్యక్రమాలను ముగిస్తామని తెలిపారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న ఈ వారం రోజుల పోరాట కార్యక్రమాల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలోని రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ చేపట్టిన ఈ సమరభేరి ప్రజా ఉద్యమంగా మారాలని ఆయన ఆకాంక్షించారు.
BRS పార్టీ సీనియర్ నాయకులు బండ శ్రీనివాస్ పోల్నెని సత్యనారాయణ రావు నైనేని తిరుపతిరావు పింగిలి రమేష్
వీణవంక మండలం నుండి ముసిపట్ల తిరుపతి రెడ్డి,నీల కుమారస్వామి, దాసరపు రాధాకృష్ణ, కాసర్ల సుధాకర్, జక్కు నారాయణ, ముత్యాల శంకర్, నాగిడి సంజీవ రెడ్డి,అడిగిప్పుల సత్యనారాయణ,