BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 6:55 pm Posted by : Reporter Srikanth

పార్టీలు మారే ఊసరవెల్లులకు  పదవుల పందేరమా..?

   ఇచ్చిన వారికి సిగ్గులేకుంటే, తీసుకునే వారికైనా సిగ్గు ఉండాలి కదా.?

పార్టీలు మారే నేను రేపు పదిమందిలో తల ఎత్తుకొని ఎలా తిరగగలను అనే జ్ఞానం కూడా ఉండాలి. 

ఎవరు అధికారంలో ఉంటే వారి చంకనాకే బుద్ధి ఇకనైనా మారదా.? అని ఆ మండల ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.

అధికారంలో ఎవరు ఉంటే.. వారి చెంతకేనా..?ఏళ్లుగా కాంగ్రెస్‌ జెండా మోసిన సీనియర్లకు అన్యాయమేనా..?

మండల అధ్యక్ష పదవిపై కార్యకర్తల అసంతృప్తి.. గ్రూపు రాజకీయాలతో వేడెక్కిన రాజకీయం…!పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వాలి.. పార్టీలు మారే వారికి కీలక పదవులు ఎలా…?మండల కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిపై వెల్లువెత్తుతున్న అసంతృప్తి సెగలు. 

పార్టీలు మారే వారికి పదవుల పందేరమా..?

అధికారంలో ఎవరు ఉంటే వారి ముందు తోక ఊపడమేనా..?

భీమ్ ఇండియా టుడే న్యూస్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాంగ్రెస్‌ మండల అధ్యక్ష పదవిపై సీనియర్ల అసంతృప్తి.. గ్రూపు రాజకీయాలతో కార్యకర్తల్లో ఆగ్రహం..!

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఓ మండల కాంగ్రెస్‌ పార్టీలో పదవుల వ్యవహారం కొత్త రాజకీయ చర్చకు దారితీస్తోంది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఏళ్ల తరబడి కాంగ్రెస్‌ కోసం పనిచేసిన సీనియర్‌ నాయకులు, కార్యకర్తలను పక్కనపెట్టి.. తరచూ పార్టీలు మారే నాయకుడికి మండల పార్టీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారు.? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నేతలతో సన్నిహితంగా ఉంటూ.. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారుతూ వస్తున్న వ్యక్తికి కాంగ్రెస్‌ మండల పార్టీ పగ్గాలు అప్పగించడం ఎంతవరకు సమంజసమని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారికి ఇదేనా గుర్తింపు….?

కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన కార్యకర్తలు, ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కాంగ్రెస్‌ను గ్రామస్థాయిలో నిలబెట్టిన సీనియర్లను కాదని.. రాజకీయంగా పార్టీ మారిన చరిత్ర ఉన్న వ్యక్తికి కీలకమైన మండల అధ్యక్ష పదవి ఇవ్వడంపై కార్యకర్తల్లో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు సమాచారం.పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు దక్కవా..? పార్టీలు మారే వారికి మాత్రం కీలక బాధ్యతలు అప్పగిస్తారా..?” అంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మండలంలో గ్రూపు రాజకీయాలేనా..?

ఆ మండల కాంగ్రెస్‌లో ఇప్పటికే వర్గ విభేదాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో తాజా అధ్యక్ష పదవి వ్యవహారం మరింత వేడి రాజేసినట్లు సమాచారం. నాయకత్వ నిర్ణయాలపై కొందరు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని, కార్యకర్తల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది.

పార్టీ కోసం కష్టపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా కుల ప్రాతిపదికన (నా కులపోడు అనే విధంగా).. వ్యక్తిగత రాజకీయ సమీకరణాల ఆధారంగా పదవులు కట్టబెడితే భవిష్యత్తులో పార్టీకి నష్టం తప్పదని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

ప్రజల్లోనూ ఇదే చర్చ..

మండల కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి విషయంలో జరుగుతున్న పరిణామాలపై స్థానికంగా కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన వారికి మళ్లీ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. కాంగ్రెస్‌ను నమ్ముకుని పనిచేసే కార్యకర్తల పరిస్థితి ఏమిటి.? అని పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.పార్టీకి విధేయత, క్రమశిక్షణ, ప్రజల్లో నిబద్ధత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పదవులు ఇవ్వాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు కోరుతున్నట్లు తెలుస్తోంది. లేకపోతే మండలంలో గ్రూపు రాజకీయాలు మరింత ముదిరి పార్టీ బలోపేతానికి బదులు అంతర్గత విభేదాలే ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.పార్టీ మారిన నాయకుడికి పదవి ఇవ్వడం వెనుక అసలు రాజకీయ సమీకరణాలేమిటి..?

సీనియర్ల అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుందా..?

కాంగ్రెస్‌ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం ఎప్పుడు..?ఈ ప్రశ్నలకు పార్టీ నాయకత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్థానిక కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.