Date of Publish : 30 August 2026, 8:53 pmPosted by : Reporter Srikanth
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పంపిణీ కాగా ఆరు నెలల సమయంలో ఇల్లు నిర్మాణం పూర్తి
శివరాత్రి అరుణ్ ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన…
– సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా : ఆగస్టు30, (హుస్నాబాద్ నియోజకవర్గం /కోహెడ మండలం ) మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన వడ్డెర కాలనీ లోని శివరాత్రి స్వప్న కీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పంపిణీ కాగా ఆరు నెలల సమయంలో ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఆదివారం గృహప్రవేశం సందర్భంగా తరుణ్, అరుణ్ ఆహ్వానం మేరకు ప్రముఖ సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు ముఖ్య అతిథిగా హాజరై వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ…
హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇండ్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లకు రాజు ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.పేదల సొంతింటి కల ప్రభుత్వంతో సాధ్యం అయిందని అన్నారు. రెండవ విడత లో ఇందిరమ్మ ఇండ్లను చాలా మంది లబ్దిదారులకు ఉన్నారని వారికీ కూడా మంజూరు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు శివరాత్రి అరుణ్ ,తరుణ్, నవీన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.