BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 9:45 pm Posted by : Reporter Srikanth

కాంగ్రెస్ నాయకులకు ఇందిరాగాంధీ పేరు చిరస్మరనీయం.

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి వేడుకలతో

కాంగ్రెస్ నాయకులకు ఇందిరాగాంధీ పేరు చిరస్మరనీయం.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా, ప్రధానిగా ఆమెను దైవసమానంగా కీర్తించడం కాంగ్రెస్ సంస్కృతిలోనే భాగం. అయితే, అదే కాంగ్రెస్ ప్రభుత్వంలోని రెడ్డి సామాజిక వర్గం ఒకప్పుడు ఇందిరను బహిరంగంగా ఎదిరించి, పార్టీని చీల్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం ఏమాత్రం సాధారణ విషయం కాదు. ఇది పక్కా వ్యూహంతో ఆడుతున్న ప్రమాదకర రాజకీయ మైండ్ గేమ్.

ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానానికి పరోక్ష సవాలు:

రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచీ ఢిల్లీ అధిష్టానం పెత్తనం, గాంధీ కుటుంబ నీడ ఆయనపై నిరంతరం వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇందిరాగాంధీని ఢీకొట్టిన సంచలన నేతను బహిరంగంగా స్మరించుకోవడం ద్వారా రేవంత్ ఒక స్పష్టమైన పరోక్ష సవాలు విసురుతున్నారు — “నేను అధిష్టానానికి లొంగే బానిసను కాను… నా రాజకీయ మార్గం స్వతంత్రం” అని!

పార్టీ క్రమశిక్షణను నేరుగా ధిక్కరించలేని బలహీనతను కప్పిపుచ్చుకుంటూ, చారిత్రక సందర్భాల ముసుగులో ఢిల్లీ పీఠానికి హెచ్చరికలు జారీ చేసే కుటిల వ్యూహమే ఇది.

సామాజికవర్గ ప్రయోజనాలకోసం బహుజన వర్గాలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే పక్కా కుట్రకోణం..

ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కాసు బ్రహ్మానందరెడ్డి బలమైన రెడ్డి సామాజికవర్గ ముద్ర ఉన్న నేత. తెలంగాణలో కాంగ్రెస్ ఉనికికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్వంత రాజకీయ భవిష్యత్తుకు ఆ రెడ్డి సామాజికవర్గ మద్దతే ప్రధాన ఆధారం. ‘చారిత్రక గౌరవం’ అనే ముసుగులో ఆ ఒక్క వర్గాన్ని మభ్యపెట్టి, తనవైపు తిప్పుకునేందుకు పన్నిన పక్కా ఎన్నికల కుట్ర ఇది. బయటకు అభివృద్ధి జపం చేస్తూనే, లోపల రెడ్డి కుల సమీకరణలను పటిష్టం చేసుకునే ప్రమాదకర రాజకీయ క్రీడకు రేవంత్ తెరలేపారు.

మొత్తంగా చూస్తే, ఈ అధికారిక వేడుక కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రికి అర్పించిన నివాళి ఎంతమాత్రమూ కాదు. ఇది కాంగ్రెస్ అంతర్గత రాజకీయంలో అధిష్టానం మైండ్ బ్లాక్ చేయడానికి పంపిన హెచ్చరిక… అలాగే ప్రాంతీయ కుల సమీకరణలను శాసించేందుకు రేవంత్ రెడ్డి పన్నిన పకడ్బందీ రాజకీయ వ్యూహం.