రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) శుభవార్త
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) శుభవార్త తెలిపింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం 5 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆగస్టు 27 నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మరో 240 బస్సులను అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడించారు. రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు అందిస్తున్న...