BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 4:23 pm Posted by : Reporter Srikanth

నూతన పి ఆర్ సి ని ప్రకటించి, ఈ హెచ్ ఎస్ ను వెంటనే అమలు చేయాలి

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, పెన్షనర్లకు నూతన పి ఆర్ సి ని ప్రకటించి, ఈ హెచ్ ఎస్ ను వెంటనే అమలు చేయాలి

     కరీంనగర్ జిల్లా టిజిఈ జేఏసీ డిమాండ్

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ పిలుపుమేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా జేఏసీ కన్వీనర్ దారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన కరీంనగర్ కలెక్టరేట్ ముందు మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ జూలై 2023 నుండి అమలు చేయాల్సిన పి ఆర్ సి ని వాయిదా వేస్తూ, ఆరు డి ఎ లను పెండింగ్ లో ఉంచడం హాస్యాస్పదంగా ఉందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నూతన పిఆర్సిని జూలై 2023 నుండి అమలుపరుస్తూ, పెండింగులో ఉన్న ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరినారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సిపిఎస్ ను రద్దు పరుస్తూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని,పెన్షనర్ల పెండింగ్ బిల్లులన్నింటినీ ఏక మొత్తంగా మంజూరు చేసి, నూతన ఈ హెచ్ ఎస్ పథకాన్ని ఏమాత్రం ఆలస్యం లేకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఉద్యోగ, పెన్షనర్లకు వెంటనే అమలయ్యే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని డిమాండ్ చేసినారు. అదేవిధంగా స్పెషల్ టీచర్లకు నో షనల్ ఇంక్రిమెంట్లను తగిన విధంగా మంజూరు చేస్తూ, రాష్ట్ర పెన్షనర్లకు ప్రత్యేక డైరెక్టరేటును ఏర్పాటు చేయాలని సూచించినారు. కార్యక్రమంలో టా ప్ర హుజురాబాద్ అధ్యక్షుడు భారత ప్రభాకర్,ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య బాధ్యులు బొంగోని వెంకటయ్య, చొల్లేటి మల్లారెడ్డి, మండల వీరస్వామి గౌరీశెట్టి సాంబయ్య, తాటిపాముల కనుకయ్య,గాజర్ల బుచ్చిరాజం, పెదపాటి రమేష్,తిరునగరి రమేష్,పరాంకుశం సనత్ కుమార్, నల్లా రాజిరెడ్డి,చాడ సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.