రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడిన రైతు నాయకుడు, కమ్యూనిస్టు నేత సారంపల్లి మల్లారెడ్డి మరణించారూ
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడిన రైతు నాయకుడు, కమ్యూనిస్టు నేత సారంపల్లి మల్లారెడ్డి మరణించారని తెలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైతుల హక్కులు, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం ముందుండి అనేక ఉద్యమాలు నడిపించారని గుర్తుచేశారు. రైతు సంఘం నేతగా, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. భూమి హక్కులు, సాగునీరు, వ్యవసాయ రుణాలు, విత్తనాలు వంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన...