BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 9:01 pm Posted by : Reporter Srikanth

ఇళ్ల స్థలాల కొరకు జర్నలిస్టులు కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షలకు

ఇళ్ల స్థలాల కొరకు జర్నలిస్టులు కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షలకు  హుజురాబాద్ బిసి జేఏసీ సంపూర్ణ మద్దతు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను తమకే ఇవ్వాలి అని జర్నలిస్టుల ఆధ్వర్యంలో గత పది రోజులుగా నిరసన, నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.అందులో భాగంగా ఈరోజు జర్నలిస్టుల సంఘం టీఎస్ జె డబ్ల్యూ ఎఫ్ హుజురాబాద్ అధ్యక్షుడు కాయిత రాములు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మద్దతుగా బీసీ జేఏసీ నాయకులు నిరాహార దీక్షలు కొనసాగించినారు.ఈ సందర్భంగా నిరాహార దీక్షలో పాల్గొన్న హుజురాబాద్ బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిబంధనలను అనుసరించి కేసీ క్యాంపులో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గూడూరు స్వామి రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధము కావడమే కాకుండా ఇది పేద జర్నలిస్టుల కడుపులను కొట్టడం తప్ప మరొకటి కాదని తమ ఆందోళనను వ్యక్తం చేసినారు.ఎక్కువ సంఖ్యలో జర్నలిస్టులు పేద వర్గానికి చెందిన వారేనని వారి కడుపు కొట్టడానికి పిటిషన్ రూపంలో అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించినారు. ఇప్పటికైనా హుజురాబాద్ నియోజకవర్గం లోని ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, అధికారులు జర్నలిస్టుల సంక్షేమం కొరకు విశాలమైన దృక్పథంతో ఆలోచించి, గూడూరి స్వామి రెడ్డితో హైకోర్టులోని పిటిషన్ విరమింప చేసి, జర్నలిస్టులకు వారికి కేటాయించిన స్థలాలను వారికే ఇప్పించి,తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసినారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వన్నాల శివాజీ, బీసీ జాతీయ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజకవర్గం మహిళా ప్రధాన కార్యదర్శి దేవ సాని ప్రియదర్శిని, భారత ప్రభాకర్, చీకట్ల సమ్మయ్య, ఇలా సాగరపు వీరస్వామి, భీంపల్లి సమ్మయ్య అంకటి కుమారస్వామి సృజన మాము నూరి ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్, ఎనగందుల వెంకటేశ్వర్లు, సంఘం సత్యనారాయణ కానుగంటి శ్రీనివాస్ పంజాల వెంకటేశ్వర్లు,గాజ గంగయ్య ఇప్పలపల్లి నరేష్ గరవేణి శ్రీకాంత్, ములుగు సతీష్,సిద్ధూ ఓ కనుకయ్య, జర్నలిస్టులు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.