భూ హ‌క్కుల విష‌యంలో ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేదు.

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేష‌న్ల అంశంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  ఇతర ఉన్నతాధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండ‌కుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు.    రిజిస్ట్రేష‌న్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో ప‌రిశీలించి,...