భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం,గుర్తింపు,హక్కుల పరిరక్షణకై తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో జరిగే బహిరంగ చర్చా వేదికను* విజయవంతం చేయాలని కోరుతూ *కరపత్రం ఆవిష్కరణ*.
తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర వరంగల్ హనుమకొండ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి
23-7-2026న *వరంగల్ ప్రెస్ క్లబ్ హనుమకొండ* (సుబేదారి)నందు తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో *తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు,హక్కుల పరిరక్షణకు సంబంధించిన సూచనలు,సలహాలు* *అభిప్రాయాలను* కోరుతూ *బహిరంగ* “*చర్చావేదిక*”
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 12 ఏళ్ల తర్వాతైనా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల గుర్తింపుకోసం ఒక చట్టబద్ధ కమిటీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈవిషయమై ప్రభుత్వానికి, ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల పక్షాన *తెలంగాణ ప్రజాఫ్రంట్* ఆధ్వర్యంలో విశాల ప్రజారాశుల అభిప్రాయాలు సేకరించి ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి చేరవేయాలనే ఉద్దేశంతో
ఈ ప్రజాభిప్రాయ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమాల కేంద్రబిందువైన వరంగల్ కేంద్రంగా నిర్వహిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఏ ఒక్కరు కూడా ఏర్పడబోయే ప్రభుత్వ గుర్తింపు కోసం తాపత్రయపడి ఉద్యమం చేయలేదనేది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమేనని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
తెలంగాణ సాధన ఉద్యమంలో అమరత్వం,జైలుశిక్షలు, కేసులు,శారీరకంగా గాయపడ్డవాళ్ళు,
మానసిక వేధింపులు ఎదుర్కొన్న వారు, ఎందరో ఉన్నారని ఇప్పటికీ కూడా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన కేసుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా,మానసికంగా మనోవేదనకు గురవుతున్న వారు ఉన్నారని, ఉద్యమ కేసుల వల్ల ఎంతోమంది జీవితంలో ఆర్థికంగా స్థిరపడలేకపోతున్న వారు ఉన్నారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాల దాటినా ఉద్యమంలో విశేష పాత్ర పోషించిన అనేకమంది ఉద్యమకారులు ఇప్పటికీ తగిన గుర్తింపు,సహాయం, సంక్షేమ పథకాలకు నోచుకున్నది లేదని ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజా ఫ్రంట్ తో పాటు అనేక ప్రజాసంఘాలు,సంస్థలు, పౌర సమాజం తెలంగాణ ఉద్యమ ప్రతీ మలుపులో కీలకంగా భాగమై పోరాడాయనీ కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రజాసంఘాలు,సంస్థలు కనుమరుగయ్యేలా చేస్తూ ఉద్యమ వరుసక్రమంలోగాని చరిత్రలోగాని,గుర్తింపులో గాని తీరని అన్యాయానికి గురైన సందర్భంలో ఉన్నామని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
కనుక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించినటువంటి ఉద్యమ ప్రజాసంఘాలు,సంస్థలు రాజకీయ పార్టీలు,వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు,వివిధ కులసంఘాలు తమతమ అభిప్రాయాలను వెల్లడి చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి ఒక నివేదిక రూపంలో అందజేయాలనే ఉద్దేశంతో ఈనెల 23 న వరంగల్ ప్రెస్ క్లబ్ నందు చర్చావేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
ఈ చర్చావేదిక కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులైన ప్రొఫెసర్ కోదండరాం గారు,రాములు నాయక్ గారు,శోభన్ రెడ్డి గార్లు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారు
వీరితోపాటు ముఖ్య వక్తగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కాశీం గారు హాజరవుతున్నారు
ప్రజలు,ప్రజాస్వామికవాదులు మేధావులు,విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని చర్చావేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో *తెలంగాణ ప్రజాఫ్రంట్ వరంగల్- హనుమకొండ జిల్లాల కార్యదర్శి గొల్లూరి ప్రవీణ్ కుమార్,*
తెలంగాణ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. తాళ్ల పెళ్లి జగన్.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు పెట్టం కుమారస్వామి,
అమరుల బంధుమిత్రుల సంఘం నాయకులు గజవెల్లి మురళి. గొల్లూరి ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజాఫ్రంట్ వరంగల్ హనుమకొండ జిల్లాల కార్యదర్శి. తదితరులు పాల్గొన్నారు