పచ్చదనంతో తీర్చిదిద్దాలి– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

కలెక్టరేట్‌ను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దాలి– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  భీమ్ ఇండియా టుడే న్యూస్ కామారెడ్డి, జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్‌లోని వివిధ శాఖలకు కేటాయించిన ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను సంబంధిత శాఖలు చేపట్టాలని ఆదేశించారు. చెత్తాచెదారం పేరుకుపోకుండా నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా...