సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 376 వ జయంతి సందర్భంగా బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుక మారి శ్రీనివాస్
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్, ఆధ్వర్యంలో, జయంతి వేడుకలు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు బీసీ ఆజాద్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గడ్డపై సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం, అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకలు ప్రజల్లో నూతన స్ఫూర్తిని నింపాయి.
ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన చూపిన ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ప్రజల కోసం చేసిన పోరాటాన్ని వక్తలు గుర్తు చేసుకున్నారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి, తన కాలంలో ఉన్న సామాజిక అసమానతలకు ఎదురిండి ప్రజల ఆత్మగౌరవం కోసం నిలబడిన పాపన్న గౌడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ….“పోరాటం ఉన్న చోటే మార్పు పుడుతుంది” అనే స్ఫూర్తిని పాపన్న గౌడ్ జీవితం మనకు అందిస్తుందని తెలిపారు. నేటి యువత ఆయన జీవిత చరిత్రను తెలుసుకుని, సమాజంలో ఐక్యత, సమానత్వం, సేవాభావం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఆజాద్ ఫెడరేషన్ మండల ఉపాధ్యక్షుడు కొలిపాక క్రాంతి కుమార్ ప్రధాన కార్యదర్శి మామునూరి ప్రవీణ్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంగం సత్యనారాయణ, చేనేత ఐక్యవేదిక మహిళా ఉపాధ్యక్షురాలు దేవసాని ప్రియదర్శిని, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, పద్మశాలి సంఘం నాయకులు మార్త రవీందర్, మంచికట్ట్ల కమలాకర్, కుడికాల ప్రభాకర్, పిట్ట శ్రీనివాస్, చంద్రగిరి కుమార్, తదితరులు పాల్గొన్నారు.