BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 10:38 pm Posted by : Reporter Srikanth

రాజకీయ సాధికారత & టీడీపీ చరిత్ర

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఎన్టీఆర్… నేడు చంద్రబాబు: 34% రిజర్వేషన్లతో బీసీలకు రాజ్యాధికారం!

శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరం.

చారిత్రాత్మక నిర్ణయాలు & సంస్కరణలు

34% బీసీ రిజర్వేషన్లు: గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు ఖరారు.

ప్రత్యక్ష ఎన్నికలు: ఆయా రామ్-గయా రామ్ సంస్కృతికి స్వస్తి పలికి, సుస్థిర పాలన కోసం మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నుకోవాలని నిర్ణయం.

28 జిల్లా ప్రజాపరిషత్‌లు: నూతన జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా 28 జెడ్పీల ఏర్పాటు.

రూ.3,862 కోట్ల ఆర్థిక నిధులు: 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద గ్రామీణ ప్రాంతాలకు రూ.2300 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.1562 కోట్లు రాబట్టేందుకు స్థానిక ఎన్నికల నిర్వహణ అత్యంత ఆవశ్యకం.

రాజకీయ సాధికారత & టీడీపీ చరిత్ర

ఎన్టీఆర్ స్పూర్తి: 1984, 1986లలో ఎన్టీఆర్ బీసీలకు తొలిసారి రిజర్వేషన్లు ఇచ్చి రాజ్యాధికారాన్ని కల్పించారు.

రిజర్వేషన్ల పెంపు: 1995లో సీఎం అయ్యాక ‘యాక్ట్ ఆఫ్ 5’ ద్వారా బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచిన ఘనత టీడీపీదే.

నాయకత్వ వికాసం: ఎర్రన్నాయుడు, యనమల, అయ్యన్నపాత్రుడు, దేవేందర్ గౌడ్‌ల నుంచి నేటి కర్నూలు ఎంపీ (మాజీ MPTC) వరకు సామాన్యులను నాయకులుగా తీర్చిదిద్దింది కూటమి ప్రభుత్వమే.

ఎమ్మెల్సీ పదవులు: వడ్డెర సామాజిక వర్గానికి చెందిన రమాదేవికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటు వడ్డెర్లకు 10% మైనింగ్ లీజులు, సబ్సిడీలు కేటాయింపు.

గత ప్రభుత్వ వైఫల్యాలు & అణచివేతపై ధ్వజం

16,800 మందికి అన్యాయం: జీవో 176, 559, 560 ద్వారా గత పాలకులు బీసీ రిజర్వేషన్లను 24.15 శాతానికి తగ్గించి, వేలాది మంది నాయకత్వ అవకాశాలను దెబ్బతీశారు.

వేధింపులు & కేసులు: అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాస్, కూన రవికుమార్ వంటి బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు.

హింసాత్మక రాజకీయాలు: తోట చంద్రయ్య, కంచర్ల జాలయ్య, నందం సుబ్బయ్య, బాలుడు అమర్నాథ్ గౌడ్ ప్రాణాలు కోల్పోయినా సిద్ధాంతం వీడలేదు.

అభివృద్ధి నిర్వచనం: కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదు… చిట్టచివరి వ్యక్తికి అవకాశాలు కల్పించి, ఆర్థిక అసమానతలు తొలగించడమే నిజమైన అభివృద్ధి.

నైపుణ్యం + టెక్నాలజీ: చేనేత, చేతివృత్తుల్లో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన బీసీలకు సాంకేతికతను జోడించి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం.

బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది, 50.54% ఉన్న బీసీ జనాభాకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగ్‌లలో సముచిత స్థానం కల్పిస్తాం.

బీసీ అంటే వెనుకబడిన వారు కాదు… అవకాశం రాక వెనుకబడిన వారు మాత్రమే. 34% రిజర్వేషన్ అనేది కేవలం సంఖ్య కాదు, నిర్ణయాధికారంలో వారికి ఇచ్చే గౌరవం.” — నారా చంద్రబాబు నాయుడు