భీమ్ ఇండియా టుడే న్యూస్ మంథనిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు*పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ బుధవారం పర్యటించనున్నారు.
సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంథని పట్టణం గంగాపురి వద్ద న్యాక్ స్కిల్ డెవలప్‌మెంట్ బిల్డింగ్‌తో పాటు, పాత పెట్రోల్ బంక్ వద్ద నాలుగు మండలాల్లోని 9 గ్రామాలకు సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 9 వైకుంఠ రథాలను సర్పంచులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రులు ప్రారంభించనున్నారు.
మంథని బస్ డిపో వద్ద రూ.164.64 కోట్లతో పలు అభివృద్ధి పనులకు, బ్రిడ్జి రోడ్డు నుంచి బస్ డిపో వరకు వెడల్పు డ్రెయిన్ నిర్మాణానికి రూ.15 కోట్లు, సెంట్రల్ లైటింగ్‌కు రూ.1.20 కోట్లు, గాంధీచౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్‌కు రూ.59 లక్షలు, అంబేద్కర్ చౌక్ నుంచి ముత్యాలమ్మ ఆలయం వరకు రోడ్డు విస్తరణకు రూ.35 లక్షలు, క్యాంప్ ఆఫీస్ రోడ్డుకు రూ.50 లక్షలు, ఇతర వార్డుల్లో రోడ్ల పనులకు రూ.9 కోట్లతో శంకుస్థాపనలు చేయనున్నారు. మంథని డిపో నుంచి డిగ్రీ కళాశాల వరకు రూ.21 కోట్ల సీఎఆర్‌ఎఫ్ నిధులతో, మంథని డిపో నుంచి గోదావరి వరకు 2 కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.22 కోట్లతో పనులు ప్రారంభించనున్నారు. సూరయ్యపల్లి నుంచి కాకర్లపల్లి మీదుగా సీతంపేట వరకు 10.8 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు రూ.29.94 కోట్లు, గుంజపడుగు నుంచి ఉప్పట్ల మీదుగా విలోచవరం వరకు 10.9 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.8.78 కోట్లు, కూనారం నుంచి ముత్తారం వరకు 18 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.36.28 కోట్ల నిధులతో శంకుస్థాపనలు చేయనున్నారు. మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో నాలుగు మండలాల ప్రజలకు రేషన్ (స్మార్ట్) కార్డులు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, మైనార్టీలకు కుట్టుమిషన్లు, మహిళా స్వశక్తి సంఘాలకు చెక్కులను మంత్రులు పంపిణీ చేయనున్నారు