సూపర్ బజార్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సురక్ష ఆస్పత్రి

మెరుగైన వైద్య సేవలు అందించాలి: వొడితల ప్రణవ్  భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: పట్టణంలోని సూపర్ బజార్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సురక్ష ఆసుపత్రిని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ ప్రారంభించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన వొడితల ప్రణవ్‌కు ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించిన వొడితల ప్రణవ్.. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. హుజురాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు...