BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 9:00 pm Posted by : Reporter Srikanth

గణతంత్ర దినోత్సవం రోజున వొడితల ప్రణవ్ బాబుకు ఘనంగా జన్మదిన వేడుకలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ గణతంత్ర దినోత్సవం రోజున వొడితల ప్రణవ్ బాబుకు ఘనంగా జన్మదిన వేడుకలుహుజురాబాద్: గణతంత్ర దినోత్సవం రోజున హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు గారు కేక్ కట్ చేసి వొడితల ప్రణవ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వొడితల రాజేశ్వరరావు గారి మనవడిగా, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్న వొడితల ప్రణవ్ బాబు జన్మదినం గణతంత్ర దినోత్సవం రోజున రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, NSUI నాయకులు, మైనారిటీ విభాగం నాయకులు, సేవాదళ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, వార్డు అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవం, వొడితల ప్రణవ్ బాబు జన్మదినం ఒకే రోజున రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు ఆయురారోగ్యాలతో, విజయాలతో నిండిన భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు.