BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 7:42 pm Posted by : Reporter Srikanth

సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర హైకోర్టు స్టే ఎత్తి వేయాలి

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ సంక్షేమ పథకాల అమలుపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని స్వేరో రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ఆకిన పెళ్లి శిరీష ప్రవీణ్ ఆధ్వర్యంలో నిరసనగా ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించ నైనది ఈ సందర్భంగా ఆమె నిర్వహించిన కార్యక్రమానికి మద్దతుగా జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ అధ్యక్షుడు సందేల వెంకన్న ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల ఓదేలు మరియు ఇతర ప్రజాసంఘాల నాయకులు తునికి సమ్మయ్య బత్తుల రాజలింగం మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని ఈ సందర్భంగా నిరసించినారు గత ప్రభుత్వము అమలుపరిచిన సంక్షేమ పథకాలను నిలిపివేయాలని హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది ఇట్టి పథకాల అమలుపై స్టే ఇవ్వడం పైన ప్రస్తుత ప్రభుత్వము ఏమాత్రం పట్టింపు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం సరైనటువంటి విధానం కాదని వెంటనే ప్రభుత్వం ఇట్టి స్టే ఎత్తివేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరి నారు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 6 గ్యారంటీలను అమలు పరచడంతో పాటు గతంలో అమలుపరిచిన సంక్షేమ పథకాలను కొనసాగించాల్సినటువంటి బాధ్యత నేటి ప్రభుత్వం పైన ఉందని పేర్కొంటూ సంక్షేమ పథకాలను అమలుపరచడంలో గత ప్రభుత్వం కన్నా తామేము తక్కువ కాదని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు అట్టడుగు అణగారిన వర్గాలకు అనుగుణంగా తగు న్యాయం చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు ప్రజల యొక్క ఆదరాభిమానాన్ని పొందగలుగుతాయని అభిప్రాయపడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలను తక్షణమే అమలు పరచాలని డిమాండ్ చేసి నారు ఇట్టి నిరసన కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్ బీసీ జాతీయ సంక్షేమ సంఘం హుజరాబాద్ నియోజకవర్గం మహిళా ప్రధాన కార్యదర్శి దేవ సాని ప్రియదర్శిని సృజన ఎస్ డి సాధిక కొలిపాక క్రాంతి కుమార్ అచ్యుత్ ముషం తిరుపతి తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపినారు