BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 8:40 pm Posted by : Reporter Srikanth

మంత్రి తుమ్మలను కలిసిన పీఏసీఎస్‌ చైర్మన్లు

మంత్రి తుమ్మలను కలిసిన పీఏసీఎస్‌ చైర్మన్లు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) నూతన చైర్మన్లు బుధవారం టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా నూతన చైర్మన్లు మంత్రికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నూతన చైర్మన్లను మంత్రికి పరిచయం చేశారు.

సహకార సంఘాల అభివృద్ధితో పాటు రైతుల సంక్షేమానికి చైర్మన్లు అంకితభావంతో పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలు, రైతులకు సమర్థవంతంగా చేరేలా కృషి చేయాలని కోరారు. సహకార సంఘాలను మరింత బలోపేతం చేసి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంత్రిని కలిసిన వారిలో ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి(ఊటూరు),గోపు మల్లారెడ్డి(పోరండ్ల),ఒగ్గు దామోదర్(బెజ్జంకి),రొంటాల లక్ష్మారెడ్డి(పచ్చునూరు),గంగుల రాంరెడ్డి(గట్టుదుద్దెనపల్లి),గాజుల మహేశ్ (మెట్ పల్లి), ఊట్కూరి వెంకట రమణారెడ్డి(ఇల్లంతకుంట),నాగిశెట్టి రాజయ్య(మానకొండూర్),గోపగోని బస్వయ్యగౌడ్( గద్దపాక),మోరపల్లి రమణారెడ్డి(నుస్తులాపూర్), కీసర సంపత్ (తాడికల్) ఉన్నారు.