దేవాదుల నుంచి గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా 9 పంపుల‌తో ఎత్తిపోత‌లు

భీమ్ ఇండియా టుడే హైదరాబాద్ గోదావరి జలాల‌ను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఎల్లంప‌ల్లితో పాటు దేవాదుల‌, సీతారామ ప్రాజెక్టుల‌ నుంచి సాధ్య‌మైనంత మేర‌కు ఎత్తిపోత‌లు చేప‌ట్టాల‌న్నారు. ముఖ్యమంత్రి  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులతో నీటి పారుద‌ల శాఖ‌పై ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో స‌మీక్ష నిర్వ‌హించారు.  దేవాదుల నుంచి గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా 9 పంపుల‌తో ఎత్తిపోత‌లు చేప‌ట్టామ‌ని సమావేశంలో మంత్రి  వివరించారు. దేవాదుల‌, సీతారామ‌ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోత‌ల‌కు సంబంధించి ఏవైనా...