తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు అవసరమైన ఏర్పాట్లు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించేలా డిసెంబర్‌లో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యాపార రంగంలోని వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్‌లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ...