BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 7:14 pm Posted by : Reporter Srikanth

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు అవసరమైన ఏర్పాట్లు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించేలా డిసెంబర్‌లో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

 వ్యాపార రంగంలోని వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్‌లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

 తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.                                              గత ఏడాది నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, వాటి పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను నివేదించాలని ఆదేశించారు.  పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు.

 ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సలహాదారులు రామకృష్ణారావు , ఉన్నతాధికారులు పాల్గొన్నారు.