BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 9:17 pm Posted by : Reporter Srikanth

భూపాలపల్లి నుంచి భారీగా తరలివచ్చిన కళాశాల విద్యార్థులు

  • యువత రాజకీయాల్లో ముందుండాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భూపాలపల్లి నుంచి భారీగా తరలివచ్చిన కళాశాల విద్యార్థులు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ హనుమకొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున హనుమకొండకు తరలివచ్చారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎదుట విద్యార్థులు నినాదాలు చేస్తూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. పబ్లిక్ గార్డెన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీగా వెళ్లారు 

తీన్మార్ మల్లన్న ఆశయాలు, ఆకాంక్షలకు ఆకర్షితులైన పలువురు విద్యార్థులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు.

అనంతరం రవి పటేల్ ఆధ్వర్యంలో విద్యార్థులు అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన “జెన్జీ యువత చర్చ విత్ తీన్మార్ మల్లన్న” కార్యక్రమంలో పాల్గొన్నారు.హనుమకొండ అంబేద్కర్ భవన్‌లో సుమారు 2,000 మంది విద్యార్థులతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న యువతతో భవిష్యత్ రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లో ముందుండి నడవాలని, రాష్ట్ర రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకురావడంలో యువత పాత్ర ఎంతో కీలకమని, యువతకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తగిన అవకాశాలు కల్పిస్తుందని తీన్మార్ మల్లన్న తెలిపారు. విద్యార్థులు, యువత తమ భవిష్యత్‌పై స్పష్టమైన అవగాహనతో ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గండు కరుణాకర్, బొగ్గు గని కార్మిక విభాగం అధ్యక్షుడు అనంతుల సంపత్ బొట్టు, జిల్లా పార్టీ మీడియా ఇన్‌చార్జి మడే సంతోష్, బసవరాజుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు అంబటి అశోక్ యాదవ్, వనం నరేష్ తదితరులు పాల్గొన్నారు.