BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 7:00 pm Posted by : Reporter Srikanth

హుజురాబాద్ నియోజకవర్గ సమస్యలపై మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 

హుజురాబాద్ నియోజకవర్గ సమస్యలపై మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రులకు వినతి

హైదరాబాద్: డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు గారు , దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు , పొన్నం ప్రభాకర్ గారు , అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్ల అధ్యక్షతన కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దృష్టికి కాల్వల ప్రాజెక్టుకు రూ.70 కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని, అలాగే పేలుళ్ల కారణంగా దెబ్బతిన్న తనుగుల చెక్‌డ్యామ్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని కోరారు.
ఎల్నినో ప్రభావం వాళ్ళ వర్షపాతం తక్కువ ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు
వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి మా హుజురాబాద్ ప్రజలకు త్రాగు సాగు నీరు అందించాలి అని కోరారు
కరీంనగర్ కొత్త జిల్లాలోని ప్రముఖ రామాలయంగా ఉన్న ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే కమలాపూర్ పెద్దమ్మతల్లి ఆలయ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.వీణవంక మండలంలోని డబుల్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు గతంలో మంజూరైన రూ.15 కోట్ల చొప్పున నిధులతో పనులు ప్రారంభించాలని కోరారు జమ్మికుంట హుజురాబాద్ పట్టణం లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు 80% పనులు పూర్తి కాగా రెండు పట్టణాలకి రెండు కోట్లు నిధులు కావాలి అని మరియు జమ్మికుంట పట్టణం లో 100%టాక్స్ కలెక్ట్ చెయ్యగా ఇన్సెంటివ్ గా రావాల్సిన 3కోట్లు ఇవ్వాలి అని కోరారు
నియోజకవర్గంలో ఇసుక రవాణా కారణంగా రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇసుక లభ్యత ఉన్నప్పటికీ రూ.1,500కు దొరకాల్సిన ఇసుక రూ.7,500 వరకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. పెద్దపల్లి, మానకొండూర్ నియోజకవర్గాల్లో మాదిరిగా హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ ట్రాక్టర్లకు ఆన్‌లైన్ విధానం లేకుండా ఇసుక తరలింపునకు అనుమతులు కల్పించాలని కోరారు.
అలాగే జమ్మికుంట మండలంలో బీపీ, షుగర్ మందులు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మందులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కమలాపూర్ బస్టాండ్‌కు హాస్పిటల్ స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
దళిత బంధు రెండో విడత నిధులను విడుదల చేయాలని, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. సైదాబాద్‌లో ఇళ్ల పట్టాలను తిరిగి ఇవ్వాలని, హుజూరాబాద్ మీడియా మిత్రులకు గతంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేశారని, వాటిని తిరిగి ఇవ్వాలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రద్దు చేసిన కొన్ని ప్రొసీడింగ్స్‌ను కూడా పునరుద్ధరించాలని కోరారు.
కరీంనగర్ జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, దొంగతనాలు, హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు.
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే మంత్రులను కోరారు
మంత్రులకు అభివృద్ధి పనులకు వినతి పత్రం ఇచ్చారు  మంత్రులు సానుకూలంగా స్పందించి మంజూరు చేస్తాం అని హామీ ఇచ్చారు .ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.