BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:11 pm Posted by : Reporter Srikanth

మన జాతీయ గీతం రచయిత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సేవలు చిరస్మరణీయం

మన జాతీయ గీతం రచయిత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సేవలు చిరస్మరణీయం

భీమ్ ఇండియా టుడే న్యూస్ కర్నూల్  ప్రజలందరు మొక్కలు నాటి మహావృక్షాలుగా చేసి, ప్లాస్టిక్ ని వాడకుండా వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి

ఆగష్టు 7 న జాతీయ గీతం రచయిత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్థంతి సందర్బంగా

నందు సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో డోన్ బిఎస్ఎన్ఎల్ ఎస్ డి ఈ .జె. రాజశేఖర్, జే టి ఓ. ఏ. గోపాల్ అధ్యక్షతన జాతీయ గీతం రచయిత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు. 

ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా డోన్ బిఎస్ఎన్ఎల్ .ఎస్ డి ఈ. జె. రాజశేఖర్, జే టి ఓ .ఏ. గోపాల్,సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ

మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి పేర్కొన్నారు*

భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7 వ తేదీన దేవేంద్రనాథ ఠాగూర్, శారదాదేవిలకు జన్మించాడు. ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి గా పేరుగాంచిన మహానుభావులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు.రవీంద్రుడు మొదటి నుండి జాతీయ భావాలున్నవాడు. దేశభక్తి గీతాలను పాడాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన “జనగణమణ” ను జాతీయ గీతంగా ప్రకటించారు. రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా ,గొప్ప మానవతావేత్తగా ఠాగూర్ చరిత్రలో నిలిచిపోయాడు. మాతృభూమి, మానవసంబంధాలపట్ల అచంచలమయిన నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగి ఉన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1941 ఆగష్టు 7న మరణించాడు.ఇటువంటి మహానుభావులను ఎల్లవేళల స్మరించుకుంటూ దేశంలోని విద్యార్థులందరూ సమాజ సేవ లో భాగస్వాములై దేశానికి సేవ చేయాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి, డోన్ బిఎస్ఎన్ఎల్. ఎస్ డి ఈ. జె .రాజశేఖర్ ,జే టి ఓ. ఏ. గోపాల్ తెలిపారు

 అలాగే ప్రజలు ఆరోగ్యం,కాలుష్యం పై అవగాహణ కలిగి ఉండి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా దోమకాటు నుంచి వచ్చేవిష జ్వరాల నుంచి కాపాడుకోవచ్చని తెలియజేశారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి. వాతావరణ కాలుష్యానికి హానికరమైన ప్లాస్టిక్ నిరోధించాలి. ప్లాస్టిక్ ని వాడకుండా మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవాలి. విరివిగా మొక్కలు నాటి మహావృక్షాలుగా తయారు చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఓజోన్ పరిరక్షణ – ఓజోన్ పొరను రక్షించుకోవాలని తెలిపారు. ,నీటిని వృధా చేయకుండ జల సంక్షోభాన్ని అరికట్టాలనిసామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు