BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 10:20 pm Posted by : Reporter Srikanth

తీజ్ ఉత్సవాలు గిరిజన, బంజారాల సంస్కృతి,

భీమ్ ఇండియా టుడే హన్మకొండ 06.08.2026

బంజారా గిరిజనుల సాంప్రదాయానికి ప్రతీక తీజ్ పండుగ…

తీజ్ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వేలేరు మాజీ ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్ 

తీజ్ ఉత్సవాలు గిరిజన, బంజారాల సంస్కృతి, సాప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని మాజీ ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్ అన్నారు. 

వేలేరు మండలం కమ్మరిపేట గ్రామ తండాలో జరుపుల,లావుడ్యా, మురావత్ నాయకులు నిర్వహించిన తీజ్ వేడుకలలో సద్దాం హుస్సేన్ పాల్గొన్నారు ఈ సందర్బంగా బంజారా యువతులు, మహిళలు 9రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్దలతో, నియమ నిష్ఠలతో పెంచిన గోధుమ మొలకల బుట్టను తల పై ఎత్తుకోగా బంజారా యువతులు, మహిళలతో పాటు సద్దాం హుస్సేన్ గారు నృత్యం చేసి సందడి చేశారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జోడుముంతల కిరణ్, ఉప సర్పంచ్ సురేష్, కమ్మరిపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు జరుపుల రమేష్, లింగయ్య, కార్తీక్, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..