BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 1:03 am Posted by : Reporter Srikanth

స్నేహానికి నిలువెత్తు నిదర్శనం.. దేశానికి గర్వకారణమైన ముగ్గురు మిత్రులు!

స్నేహానికి నిలువెత్తు నిదర్శనం.. దేశానికి గర్వకారణమైన ముగ్గురు మిత్రులు! ఐఏఎస్. ఐపీఎస్. ఐఆర్ఎస్ ..   భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ UPSC CSE–2023లో అద్భుత విజయం.. స్నేహ బంధంతో IASగా ఎదిగిన యువతకు దేశం సెల్యూట్

స్నేహం అంటే కేవలం కలిసి గడిపే క్షణాలు మాత్రమే కాదు.. ఒకరి విజయానికి మరొకరు బలంగా నిలబడటం కూడా అని ముగ్గురు యువ సివిల్ సర్వెంట్లు నిరూపించారు. ఆదిత్య శ్రీవాస్తవ్ (ఉత్తరప్రదేశ్), పి.కె. సిద్ధార్థ్ రామ్‌కుమార్ (కేరళ), రూహానీ (జమ్మూ & కాశ్మీర్) తమ స్నేహాన్ని విజయానికి మార్గంగా మార్చుకొని UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో అద్భుత ఫలితాలు సాధించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.

ఈ ముగ్గురు మొదట భారత పోలీసు సేవ (IPS)లో ఎంపికై శిక్షణ పొందుతున్న సమయంలో స్నేహితులయ్యారు. అయితే అక్కడితో ఆగకుండా, పరస్పరం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మళ్లీ UPSC పరీక్షకు సిద్ధమయ్యారు. కష్టసమయంలో ఒకరికి ఒకరు అండగా నిలిచి చివరకు IAS సాధించి చరిత్ర సృష్టించారు.

ఆదిత్య శ్రీవాస్తవ్ UPSC CSE–2023లో ఆల్ ఇండియా ర్యాంక్–1, పి.కె. సిద్ధార్థ్ రామ్‌కుమార్ ఆల్ ఇండియా ర్యాంక్–4, రూహానీ ఆల్ ఇండియా ర్యాంక్–5 సాధించి దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచారు. .ఆదిత్య శ్రీవాస్తవ్ – ఉత్తరప్రదేశ్

వారి రాష్ట్రాలు

ఆదిత్య శ్రీవాస్తవ్ – ఉత్తరప్రదేశ్

పి.కె. సిద్ధార్థ్ రామ్‌కుమార్ – కేరళ

రూహానీ – జమ్మూ & కాశ్మీర్

భారతదేశం గర్వించే స్నేహం

పోటీ ప్రపంచంలో ఒకరి విజయాన్ని చూసి అసూయపడకుండా, అదే విజయాన్ని అందుకోవాలని ఒకరినొకరు ప్రోత్సహించడం నిజమైన స్నేహానికి నిదర్శనం. ఈ ముగ్గురు యువ అధికారులు చూపించిన ఐక్యత, కృషి, పరస్పర సహకారం దేశ యువతకు ఆదర్శంగా నిలిచింది.

స్నేహం ఉంటే అసాధ్యమనే మాట ఉండదు” అనే సందేశాన్ని తమ జీవితాలతో చాటి చెప్పిన ఈ ముగ్గురు మిత్రులను చూసి భారతదేశం గర్విస్తోంది. వారి స్నేహం ప్రతి యువకుడికి ప్రేరణగా నిలిచి, లక్ష్యసాధనలో స్నేహితుల పాత్ర ఎంత గొప్పదో మరోసారి నిరూపించింది.