ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ నుంచి పారిపోయారు. హనుమకొండ జిల్లా

ఆహారంలో పురుగులు వస్తున్నాయని.. ఇక్కడ ఉండలేమంటూ ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ నుంచి పారిపోయారు.భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని మందారిపేట శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీవీబీ) నుంచి అర్ధరాత్రి గోడదూకి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ ప్రహరీ గోడ దాటి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది, పోలీసులు, తల్లిదండ్రులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు....