Date of Publish : 31 July 2026, 2:56 pmPosted by : Reporter Srikanth
హుజూరాబాద్‌లో హిజ్రా సమాజంలో విషాదం
హుజూరాబాద్‌లో హిజ్రా సమాజంలో విషాదం
రెంటాల కుమారి మృతికి హిజ్రా సంఘాల ఘన నివాళి.. బలగాలతో సంఘీభావం
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్హుజూరాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ప్రముఖ హిజ్రా సమాజ సభ్యురాలు రెంటాల కుమారి ఆకస్మిక మరణం హిజ్రా సమాజాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. కుమారి మృతికి సంతాపం తెలుపుతూ వివిధ హిజ్రా సంఘాలు, గురువులు, శిష్యులు మరియు స్నేహితులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.కుమారితో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, “నిన్నటి వరకు మాతో కలిసి నవ్వుతూ, సంతోషాలను పంచుకున్న మా ఆత్మీయ సోదరి ఈరోజు శాశ్వతంగా దూరం కావడం ఎంతో బాధాకరం. నిన్నటి దినమున స్నేహబంధం ఈరోజు మరణ బంధంగా మారిపోయింది” అంటూ భావోద్వేగానికి గురయ్యారుకుమారి అంతిమయాత్రలో హిజ్రా సంఘాలు ప్రత్యేకంగా బలగాలతో పాల్గొని ఆమెకు ఘనంగా నివాళులర్పించాయి. ఆమె సేవలు, స్నేహపూర్వక స్వభావం, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తిత్వాన్ని పలువురు గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు హిజ్రా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, కుమారి మరణం హిజ్రా సమాజానికి తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.రెంటాల కుమారి జ్ఞాపకాలు ఎప్పటికీ తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని హిజ్రా సంఘాల సభ్యులు కన్నీటి నివాళులర్పించారు.