BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 1:03 pm Posted by : Reporter Srikanth

గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోయాం ‘పెద్ది’ మరణం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ :- మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల వొడితల సతీష్ కుమార్ దిగ్భ్రాంతి

గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోయాం ‘పెద్ది’ మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటుహుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు

ఆయన మాట్లాడుతూ, “పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ధీశాలి నాయకుడు. ఉద్యమ స్ఫూర్తిని గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. ప్రజల కోసం, తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి” అని అన్నారు.

అనారోగ్యంతో ఆయన మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, తనతో ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్రను ఎన్నటికీ మరువలేమని అన్నారు.

ప్రజా జీవితంలో నిబద్ధత, నిరాడంబరత, ఉద్యమ పట్ల అంకితభావంతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.*

పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు


పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి” అని వొడితల సతీష్ కుమార్ అన్నారు