BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 3:12 pm Posted by : Reporter Srikanth

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 75వ వన మహోత్సవం

.          భీమ్ ఇండియా టుడే న్యూస్  వర్షంలోనూ పచ్చదనానికి ప్రజల మద్దతు

హౌజింగ్ బోర్డు ప్రాంతంలో ఉత్సాహంగా మొక్కల పంపిణీ 75వ వన మహోత్సవంలో ప్రజల భాగస్వామ్యం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 75వ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా పురపాలక సంఘం  హౌజింగ్ బోర్డు ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వర్షం కురుస్తున్నప్పటికీ అధికారులు, పురపాలక సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంటింటా పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, అలంకార మొక్కలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని సూచించారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి పచ్చదనం పెంపే శాశ్వత పరిష్కారమని తెలిపారు.

స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి విశేష స్పందన చూపి మొక్కలను స్వీకరించి, వాటిని సంరక్షిస్తామని హామీ ఇచ్చారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిర్వహించిన ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడంలో కీలకంగా నిలిచింది.

కరీంనగర్ హౌజింగ్ బోర్డు ప్రాంతంలో 75వ వన మహోత్సవం సందర్భంగా ప్రజలకు మొక్కలను పంపిణీ చేస్తున్న పురపాలక అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు.