BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 11:44 pm Posted by : Reporter Srikanth

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీభీమ్ ఇండియా టుడే న్యూస్ హసన్ పర్తి 2026–27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభమైనట్లు వరంగల్ ప్రాంతీయ సంచాలకులు ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్మీడియట్, 10+2 అర్హత కలిగిన విద్యార్థులతో పాటు రెండేళ్ల పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు.

డిగ్రీ ప్రవేశాల కోసం ఆధార్ కార్డు, SSC, ఇంటర్మీడియట్ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైన వారికి), పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో సమీప ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రవేశాలకు ఆగస్టు 7 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. అభ్యర్థులు www.braouonline.in వెబ్‌సైట్‌లో ప్రవేశ నమోదు పూర్తి చేసి, తాము ఎంపిక చేసుకున్న అధ్యయన కేంద్రంలో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాలని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1800-599-0101, ఫోన్ నంబర్లు 040-23680333, 040-23680444, 040-23680555లను సంప్రదించాలని జ్యోతి కోరరూ