కంటోన్మెంట్‌లో 40శాతం ఓట్లు రద్దు కేటగిరీలోకి!
ఐదు నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి
బోయిన్‌పల్లి: విధుల్లో బీఎల్‌వోలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ : రాజధానిలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గబోతోంది. గరిష్ఠంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో 40శాతానికిపైగా ఓట్లు రద్దు కేటగిరీలో చేరనున్నాయి. సికింద్రాబాద్, యాఖుత్‌పుర తదితర నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
పత్రాలు తిరిగివ్వడం లేదు.. ఎన్యూమరేషన్ పత్రాలను తీసుకున్న వారు చాలామంది వాటిని తిరిగివ్వట్లేదు. ఆగస్టు 3 వరకు గడువుందని నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అయితే, చివరి తేదీన సర్వర్ సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఉద్యోగులు డిజిటలైజేషన్‌లో వేగం పెంచారు. ఎన్యూమరేషన్ పత్రాలను ఇవ్వని వారి ఓట్లు కూడా ఏఎస్‌డీ జాబితాలోకి వెళ్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అంబర్‌పేటలో అత్యల్పం.. హైదరాబాద్ జిల్లా పరిధిలోని అంబర్‌పేటలో ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలీకరణ 50శాతం పూర్తయింది. అయితే, రద్దు కేటగిరీ ఓట్లు అంబర్‌పేటలో 3 శాతం, కంటోన్మెంట్‌లో 20శాతం ఉన్నాయి.
బీఎల్‌వోల నిర్లక్ష్యమూ..: సర్‌లో కంటోన్మెంట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. పత్రాల పంపిణీ.. స్వీకరణ, డిజిటలీకరణలో సక్రమంగా విధులు నిర్వర్తించట్లేదు. దీంతో ఇప్పటి వరకు 20 శాతం ఓట్లు ఏఎస్‌డీలోకి వెళ్లాయని, మరో వారం రోజుల్లో 40శాతానికి మించుతుందని స్థానిక యంత్రాంగం అంచనా వేస్తోంది.
ఏఎస్‌డీ జాబితాలోకి..
ఎన్యూమరేషన్ పత్రాలను తిరిగివ్వని వారితోపాటు, ఇల్లు మారిన, నియోజకవర్గం మారిన, మృతి చెందిన (ఏఎస్‌డీ) ఓటర్ల వివరాలను జాబితా నుంచి రద్దు చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది.
హైదరాబాద్ జిల్లాలో..
- మొత్తం ఓట్లు 47,36,669
- డిజిటలైజేషన్ పూర్తయినవి 24,67,704
- వాటిలో రద్దు కేటగిరీలో చేరినవి.. 4,35,501 (9.19శాతం)