కమీషన్‌కు ఆశపడి.. ఖజానా దోపిడీ

తీసుకున్న ‘టెన్‌ పర్సెంట్‌’ ఇచ్చేయండి   అధికారులకు గుత్తేదారుల ఝలక్‌ 78 మంది లైసెన్సులను నిలిపేసిన జీహెచ్‌ఎంసీ భీమ్ ఇండియా టుడే హైదరాబాద్  ఒకే పనికి రెండుసార్లు బిల్లులు చెల్లించిన అధికారులకు.. గుత్తేదారులు ఝలక్‌ ఇస్తున్నారు. అవినీతి వెలుగులోకి రావడంతో.. అడ్డదారిలో వెళ్లిన నిధులను రికవరీ చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అయితే.. రెండో బిల్లుకు 10 శాతం కమీషన్‌ తీసుకున్న అధికారులూ.. ఆ డబ్బును తిరిగివ్వాలని కాంట్రాక్టర్లు పట్టుబడుతున్నారు. అలాగే.. అధికారులు అడుగుతున్న వడ్డీ డబ్బును చెల్లించలేమంటున్నారు. బల్దియా చరిత్రలో తొలిసారి.. కమీషన్, వడ్డీ...