సెలవు దినం.. బొగతకు పోటెత్తిన జనం
భీమ్ ఇండియా టుడే న్యూస్ వాజేడు ములుగుజిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం సందర్శనకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. హైదరాబాద్, వరంగల్ నగరాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలిరావడంతో జలపాతం పరిసరాలు సందడిగా మారాయి. కొండలు, గుట్టల నుంచి పారుతున్న వరద జలపాతం వద్ద కిందకు దూకుతూ హోరెత్తిస్తోంది. పాలనురగలా జాలువారుతున్న నీటిధారలను తిలకిస్తూ సందర్శకులు ఉత్సాహంగా గడిపారు. బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చిన వారు స్వీయ చిత్రాలు తీసుకున్నారు....