తక్కువ శ్రమ.. నికర రాబడి

సరుగుడు, నీలగిరి, సుబాబుల్‌పై పెరుగుతున్న ఆసక్తి   జిల్లాలో 2,900 ఎకరాల్లో సాగు భీమ్ ఇండియా టుడే జగిత్యాల వాణిజ్యం : జగిత్యాలజిల్లా మేడిపల్లి మండలం తొంబర్రావుపేట రైతు సురకంటి సతీశ్‌రెడ్డి 1.06 ఎకరాల్లో సరుగుడు మొక్కలు నాటారు. 26 నెలల తరువాత 60 టన్నుల కర్రల దిగుబడి వచ్చింది. టన్నుకు రూ.6,500 చొప్పున విక్రయించగా రూ.3.90 లక్షల ఆదాయం సమకూరింది. పెట్టుబడి కింద రూ.45 వేల ఖర్చయింది. లాభసాటిగా ఉండటంతో ప్రస్తుతం మరో 4 ఎకరాల్లో నాటారు. సతీశ్‌రెడ్డి మాదిరిగానే ఉమ్మడి జిల్లాలో...