నిబంధనలకు సమాధి.. నిర్మాణాలకు పునాది

పరకాలలో మురుగుకాల్వను ఆనుకొని నిర్మిస్తున్న ఇళ్ళు భీమ్ ఇండియా టుడే పరకాల:హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలో అక్రమ ఇళ్ల నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొందరు నిబంధనలను విస్మరించారు. సెట్‌బ్యాక్‌ లేకుండానే ఇళ్లు, భవనాల నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీంతో పురపాలక సంఘం ఆదాయానికి గండి పడుతోంది. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్‌ అధికారులు చోద్యం చూస్తున్నారు. పట్టణంలో 22 వార్డులుండగా రాజిపేట, సీతారాంపురం విలీన గ్రామాలున్నాయి. 9,175 ఇళ్లు అధికారికంగా ఉండగా, ఇంటి నంబర్లు లేని గృహాలు సుమారు 300 వరకు ఉన్నాయి....