హనుమకొండలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

బీమ్ ఇండియా టుడే ఎన్జీవోస్ కాలనీ :హనుమకొండ నగరంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘విజయ్ మార్చ్’ పేరిట కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షల...