. భీమ్ ఇండియా టుడే న్యూస్:- కార్పొరేట్ సంస్థలు మారుమూల ప్రాంతాల్లోని పేదలకు మరిన్ని సేవలను అందించేందుకు ముందుకు రావాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి.. హైదరాబాద్ ఈసీఐఎల్ కంపెనీ ఆధునిక యంత్రాల సౌకర్యాలు ఉన్న అంబులెన్స్‌ను అందజేసింది. ఈ అంబులెన్స్‌ను హుస్సేన్ నాయక్ ప్రారంభించి మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా ఇప్పటికే చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. మరింత బాధ్యత తీసుకొని వారి సేవలను మారుమూల ప్రాంతాలకు విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.