ఆర్టిజన్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
భీమ్ ఇండియా టుడే: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం (రి.నెంబర్ -327) రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండలోని పళ్ల రవీందర్ రెడ్డి భవన్లో యూనియన్ కంపెనీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. సమ్మె విరమిస్తేనే చర్చలకు పిలుస్తామని చెప్పిన...