. భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ . సీఎం రేవంత్ రెడ్డికి .బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లీగల్ నోటీసులు పంపారు. గ్లోబరీన టెక్నాలజీస్ అంశంలో చేసిన ఆరోపణలపై 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ” ఎలాంటి అహధారాలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు. గ్లోబరీనా సంస్థతో నాకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమాన్య హక్కులు లేవు. గ్లోబరీన నా బినామీ కంపెనీ అనడం.. సిబిఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించాను అనడం పూర్తిగా అవాస్తవం. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉంటూ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు. రాజకీయ లబ్ధి కోసమే నా ప్రతిష్టను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారు. గడువులోపు క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తాము” అని కేటీఆర్ అన్నారు