కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ప్రశ్నించే గొంతుకలపై నిర్బంధం ఆపాలిహనుమకొండ జిల్లా, మాణిక్యాపూర్ గ్రామం నుండి డిమాండ్
భీమ్ ఇండియా టుడే న్యూస్ :– పేపర్ లీకేజీలతో పాటు దేశవ్యాప్తంగా పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, దేశంలో ప్రశ్నించే గొంతులపై నిర్బందాన్ని ఆపాలి.
పర్యావరణవేత్త సోనం వాంగ్ చుక్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బుధవారం గ్రామ బస్టాండ్ కేంద్రం దగ్గర నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు… మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను క్యాబినెట్ నుండి తొలగించాలని, విద్యార్థులు యువత మేధావులు డిమాండ్ చేస్తున్నప్పటికీ, యూనియన్ గవర్నమెంట్ పట్టించుకోకుండా ఉండటం అన్యాయం అన్నారు. లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యం కోసం CJP వ్యస్థాపకుడు,*పర్యావణ వేత్త సోనం వాంగ్ చుక్* చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను నిరంకుశత్వంతో అణచివేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వం తన తప్పిదాలను సరి చేసుకోకుండా విద్యార్థుల పక్షాన నిలబడుతున్న సోనం వాంగ్ చుక్ వంటి మేధావులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం చేస్తున్న లోపాలను ఎత్తి చూపడానికి కూడా స్వేచ్ఛ లేకుండా ప్రతిపక్షాలను అణచివేస్తున్న ప్రభుత్వ నిరంకుశ వైఖరి సమర్ధనీయం కాదన్నారు. చివరికి అత్యున్నత న్యాయస్థానాలే చొరవ తీసుకొని సమస్య పరిష్కారానికి మార్గాలు వెతకాలని చెప్పడం బీజేపీ కేంద్రప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అన్నారు.
తక్షణమే బీజేపీ గవర్నమెంట్ అక్రమంగా నిర్బంధలోకి తీసుకున్న సోనం వాంగ్ చుక్ ను విడుదల చేసి, శాంతియుత నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని, నీటి పేపర్ లీకేజీలో పరీక్షల నిర్వహణలో అవకతవకలపై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న యువతపై నిర్బంధ ఆపాలని లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు, డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు రాజకీయ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ .గొల్లూరి ప్రవీణ్ కుమార్, తెలంగాణ ఉద్యమంలో గ్రామస్థాయిలో ముఖ్య పత్ర పోషించిన సీనియర్ నాయకులు ఒల్లాల. తిరుపతి గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు వార్డు మెంబర్ పార్నందుల. క్రాంతి కుమార్ ఎన్ ఎస్ యు ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం. శివ గౌడ్, ఎదులాపురం. సదానందం, గాంధీనగర్ ఉప సర్పంచ్ బుర్ర. సమ్మయ్య గౌడ్, పెట్టెం. కుమారస్వామి, బుర్ర. నారాయణ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ ఆనాపురం. శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఉద్యమాలలో సీనియర్ నాయకులు గజవెల్లి. మురళి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం. కనకయ్య తదితరులు పాల్గొన్నారు.