BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 11:28 pm Posted by : Reporter Srikanth

ఎన్‌సీడీసీ బాలల వసతిగృహాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి

ఎన్‌సీడీసీ బాలల వసతిగృహాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి

సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – అధికారుల సూచనలు

భీమ్ ఇండియా టుడే. సుర్యాపేట జిల్లా: మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌సీడీసీ బాలల వసతిగృహాన్ని డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతిగృహంలో విద్యార్థులకు అందుతున్న ఆహారం, వసతి, పరిశుభ్రత, వైద్య సదుపాయాలు, భద్రత తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వసతిగృహంలో రికార్డుల నిర్వహణ, మెనూ అమలు, హాజరు నమోదు తదితర అంశాలను పరిశీలించిన డిప్యూటీ డైరెక్టర్, నాణ్యమైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. పిల్లల ఆరోగ్యం, విద్య, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

ఈ తనిఖీలో సంబంధిత శాఖ అధికారులు, వసతిగృహ సిబ్బంది పాల్గొన్నారు.