BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 10:17 pm Posted by : Reporter Srikanth

బి.సి. సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కందికొండ మొగిలి నియామకం.

బి.సి. సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కందికొండ మొగిలి నియామకం.

హుజురాబాద్, జూలై 18:జాతీయ బి.సి. సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన కందికొండ మొగిలి నియమితులయ్యారు. జిల్లా స్థాయిలో వెనుకబడిన తరగతుల (బి.సి.) సామాజిక, రాజకీయ చైతన్యం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించారు. బి.సి. సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల అయిలేశ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయనకు నియామకపు ఉత్తర్వులను జారీ చేశారు.

హర్షం వ్యక్తం చేసిన మొగిలి

తన నియామకంపై కందికొండ మొగిలి హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకముంచి ఈ కీలక బాధ్యతలను అప్పగించినందుకు జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల అయిలేశ్ యాదవ్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ నియామకానికి సహకరించిన సంఘం నాయకులు పొలవేని పోచమల్లు యాదవ్, సందెల వెంకన్న, పీరెల్ల సాగయ్య, భీమ సాయిలు యాదవ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

బి.సి.ల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తాం.ఈ సందర్భంగా మొగిలి మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో బి.సి.ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. బి.సి.లందరినీ సంఘటిత పరిచి, చట్టసభల్లో బి.సి.లకు రిజర్వేషన్ల సాధన కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

భీమ్ ఇండియా టుడే హుజురాబాద్