BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 9:27 pm Posted by : Reporter Srikanth

ఈశ్వరమ్మ యాదవ్ ను దూషించిన రెడ్డి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి.


హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా..బిసి జేఏసీ అధ్యక్షులు సందేల వెంకన్న ఆధ్వర్యంలో.

ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్దన్.

హుజురాబాద్, జూలై 17

యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డ ఈశ్వరమ్మ యాదవును దూషించిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని హుజూరాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షులు సందేల వెంకన్నఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద ధర్నా కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలోపాల్గొన్న బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్దన్ మాట్లాడుతూ,స్వాతంత్రము లభించి 79 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బీసీల పైన అగ్రకులాల ఆగడాలు రోజు రోజుకు పెచ్చు పెరుగు తున్నాయే తప్ప తగ్గడం లేదు?అని ఆవేదన వ్యక్తం చేస్తూ యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి గుడి పాలకవర్గ సభ్యురాలిగా నియమింపబడినఈశ్వరమ్మ యాదవ్ సన్మాన కార్యక్రమం ఫ్లెక్సీలో తన పేరును పెట్ట లేదన్న అక్కసుతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శివ చరణ్ రెడ్డి ఈశ్వరమ్మ ను దుర్భాషలాడడాన్ని గర్హిస్తూ ఇటువంటి మాటలు మానుకోవాలని శివ చరణ్ రెడ్డిని హెచ్చరిస్తూ, కుల పరంగా దూషించిన అతనిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 60శాతం పైగా ఉన్న బీసీలు ఏకమై ఐకమత్యంతో ముందుకు కదిలినప్పుడు మాత్రమే అగ్రకులాల వారిని ఎదిరించగలుగుతామనిఅభిప్రాయపడినారు. పార్టీలకు పదవులకు అతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఐకమత్యంతోరాజ్యాధికారాన్ని దక్కించుకున్నప్పుడు మాత్రమే అగ్రకులాలను ఎదిరించే శక్తి పొందగలుగు తామని ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల బిడ్డలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వన్నాల శివాజీ, బీసీ జేఏసీ కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, కొలిపాక క్రాంతి కుమార్, మావునూరి ప్రవీణ్ కుమార్, బీసీ నాయకురాలు దేవసాని ప్రియదర్శిని, స్వేరో నాయకులు అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్, ప్రజా సంఘాల నాయకులు రామ్ సారయ్య, గడప రాజు, మేకల రవి, దొంత హరికిషన్, సొల్లు శంకర్, బుదారపు కుమారస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.