క్రీడా రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: సీఎం రేవంత్ రెడ్డి
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్యాష్ రివార్డులు, ప్రభుత్వ ఉద్యోగాలు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను క్యాష్ రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన సీజన్-1 టీజీ-20 క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు సభ్యులు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను...