
క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్– ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
నరసరావుపేట, పల్నాడు జిల్లా:
పల్నాడు జిల్లా నరసరావుపేటలో నేడు నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌తో కలిసి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలు (SHGs), రైతులు, చిరు మరియు చిన్న వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తలు, వివిధ వర్గాల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్యాంకులు అందించే రుణాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, రైతుల వ్యవసాయాభివృద్ధికి, యువత స్వయం ఉపాధి కలల సాకారానికి, మహిళల ఆర్థిక సాధికారితకు, చిరు వ్యాపారుల వ్యాపార విస్తరణకు బలమైన పెట్టుబడిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు బ్యాంకింగ్ వ్యవస్థ కలిసి పనిచేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు, చిన్న వ్యాపారులకు సులభ రుణాల అందుబాటు వల్ల ఉపాధి అవకాశాలు పెరిగి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొంటూ, రాష్ట్రానికి మద్దతుగా నిలుస్తున్నందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రుణాల పంపిణీ ద్వారా లబ్ధిదారులు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.
నరసరావుపేటలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహణ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొనడo
SHGs, రైతులు, యువత, చిరు వ్యాపారులకు రుణాల పంపిణీ
మహిళా సాధికారిత, స్వయం ఉపాధి, వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర సహకారం కొనసాగుతుందని ఆశాభావం
భీమ్ ఇండియా టుడే ప్రత్యేకం:
“రుణం కేవలం డబ్బు కాదు… ఒక కుటుంబ భవిష్యత్తుకు, ఒక రైతు పంటకు, ఒక మహిళ ఆత్మవిశ్వాసానికి, ఒక యువకుడి కలలకు బలమైన పునాది. తిప్పారపు.సాగర్ స్పెషల్ స్టోరీ బీమ్ ఇండియా టుడే