వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి

రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు హుజురాబాద్, జూలై 16 (BheemIndiaToday):** ఎల్‌నినో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున రైతులు వ్యవసాయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. గురువారం హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ నిఖిల్ కుమార్ మాట్లాడుతూ రైతులు తమ మొత్తం వ్యవసాయ విస్తీర్ణంలో వరి సాగు చేయకుండా కొంత భాగంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు...