డాక్టర్ జి వి పూర్ణచందు గారికి లోకగురు పురస్కార ప్రదానం

విలువల విద్య, విలువైన విద్య వ్యాప్తికి కృషిచేసే విద్యార్ధి వికాస వాహిని స్వచ్చంద సంస్థ ఈ సంవత్సరం లోకగురు పురస్కారాన్ని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, ఆహార శాస్త్రవేత్త , తెలుగు భాషోద్యమ నేత డాక్టర్ జి వి పూర్ణచందు గారికి అందిస్తోంది. వారు గత యాభై సంవత్సరాలుగా వారి ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా ఆరోగ్యశాస్త్రములో , సాహిత్య ప్రక్రియలలో అనేకమంది సామాన్య జనులను విజ్ఞాన వంతులుగా చేసినందుకు ఈ లోకగురు పురస్కారం తో సత్కరించబడుతున్నారు. ఈ కార్యక్రమము విద్యార్ధి వికాస వాహిని సంస్థాపక...