విలువల విద్య, విలువైన విద్య వ్యాప్తికి కృషిచేసే విద్యార్ధి వికాస వాహిని స్వచ్చంద సంస్థ ఈ సంవత్సరం లోకగురు పురస్కారాన్ని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, ఆహార శాస్త్రవేత్త , తెలుగు భాషోద్యమ నేత డాక్టర్ జి వి పూర్ణచందు గారికి అందిస్తోంది. వారు గత యాభై సంవత్సరాలుగా వారి ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా ఆరోగ్యశాస్త్రములో , సాహిత్య ప్రక్రియలలో అనేకమంది సామాన్య జనులను విజ్ఞాన వంతులుగా చేసినందుకు ఈ లోకగురు పురస్కారం తో సత్కరించబడుతున్నారు. ఈ కార్యక్రమము విద్యార్ధి వికాస వాహిని సంస్థాపక దినోత్సవం గురుపూర్ణిమ సందర్భముగా జులై 29 తారీఖు సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపములోని సర్వోత్తమ గ్రంధాలయములో నిర్వహించబడునని తెలియ చేస్తూ విద్యార్ధి వికాస వాహిని సభ్యులను, శ్రేయోభిలాషులను, విద్యావేత్తలను, విద్యార్థులను, ఉపాధ్యాయులను, రచయితలను , రోటరియన్లను, పూర్ణచందు గారి సన్నిహితులను , మీడియా మిత్రులను సాదరముగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ హై కోర్ట్ జడ్జి జస్టిస్ శేష సాయి గారు ముఖ్య అతిధిగా విచ్చేసి పురస్కార ప్రదానం చేస్తారు.
— రోటరియాన్ వేములపల్లి కేశవ రావు,
వ్యవస్థాపక అధ్యక్షులు, విద్యార్ధి వికాస వాహిని