“ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించాలి. పలుగు, పార పట్టిన చేతులే.. కలాలు పట్టి తెలంగాణ రాత మార్చాలి” అని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ✳️ “ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. చదువొక్కటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. చదువే సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపుతుంది” అని విద్యార్థులకు ఉద్బోధించారు. ✳️ వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల...